Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తొలి వెబ్ సిరీస్ రిలీజైన మరుసటి రోజే దర్శకుడు కన్నుమూత

Belraj Kalarikkal Tragedy in Malayalam cinema as young director dies in hotel room
Advertisement
  • మలయాళ యువ దర్శకుడు బెల్రాజ్ కలరిక్కల్ (27) కన్నుమూత
  • కొచ్చిలోని హోటల్ గదిలో గుండెపోటుతో మరణించినట్లు ప్రాథమిక సమాచారం
  • నిన్ననే ఆయన తొలి వెబ్ సిరీస్ 'కప్పి స్క్వాడ్' విడుదల
  • గత నెలలోనే వివాహం చేసుకున్న బెల్రాజ్
Advertisement
మలయాళ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. యువ దర్శకుడు బెల్రాజ్ కలరిక్కల్ (27) శనివారం ఆకస్మికంగా కన్నుమూశారు. కొచ్చిలోని ఒక హోటల్ గదిలో ఆయన విగతజీవిగా కనిపించడం కలకలం రేపింది. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఆయన గుండెపోటుతో మృతి చెందారు.

బెల్రాజ్ దర్శకత్వం వహించిన తొలి వెబ్ సిరీస్ 'కప్పి స్క్వాడ్' శుక్రవారమే జియో హాట్‌స్టార్‌లో విడుదలైంది. కాగా, ఆరేళ్ల ప్రేమాయణం అనంతరం గత సెప్టెంబర్‌లోనే ఆయన వివాహం చేసుకున్నారు. అటు వృత్తిగతంగా, ఇటు వ్యక్తిగత జీవితంలో స్థిరపడుతున్న తరుణంలో బెల్రాజ్ అకాల మరణం చెందడం చిత్ర పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

గతంలో 'నిజల్', 'మధురం', 'డాకిని' వంటి చిత్రాలకు బెల్రాజ్ సహాయ దర్శకుడిగా పనిచేశారు. 'కప్పి స్క్వాడ్' వెబ్ సిరీస్‌తో ఆయన పూర్తిస్థాయి దర్శకుడిగా పరిచయమయ్యారు. రినోష్ జార్జ్, అనఘ అజిత్, దియా దీపన్, జోయెల్ జోసెఫ్ ప్రధాన పాత్రల్లో పోషించిన ఈ సిరీస్, నలుగురు యువకుల స్టార్టప్ కలల నేపథ్యంలో సాగుతుంది. శ్రీకాంత్ మోహన్ రూపొందించిన ఈ సిరీస్‌ను ప్రముఖ నిర్మాత రాహుల్ రిజి నాయర్ నిర్మించారు. గతంలో రాహుల్ వద్ద 'డాకిని', 'కీడమ్', 'ఖో ఖో' వంటి చిత్రాలకు బెల్రాజ్ సహాయకుడిగా విధులు నిర్వహించారు.
Advertisement
Advertisement
Belraj Kalarikkal
Malayalam Director Death
Kappi Squad Web Series
Kochi Hotel Room

More Telugu News